News
మోదీపై మోహన్‌లాల్ ప్రశంసలు
నల్లధనం నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. ‘పెద్ద నోట్లు రద్దు అనే నిర్ణయాన్ని నేను సర్జికల్ స్ట్రైక్‌లానే భావిస్తున్నాను. నేను నేతల్ని పూజించను. కానీ ఆ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా మున్ముందు మంచి జరుగుతుందని నాకు అర్థమైంది. ఇలాంటి ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని ప్రభావం కనిపించకుండా పోదు. డబ్బు కోసం గంటల తరబడి బ్యాంకు ఎదుట బారులు తీరుతున్న ప్రజల బాధను నేను అర్థంచేసుకోగలను. కానీ మద్యం దుకాణాలు, సినిమా థియేటర్లు, గుళ్లుగోపురాల ఎదుట కూడా గంటలు తరబడి నిలబడుతుంటాం. అలాగే మున్ముందు జరగబోయే మంచి కోసం కొద్ది గంటల పాటు నిలబడినా నష్టం లేదని నా అభిప్రాయం’ అంటూ మోహన్‌లాల్ తన బ్లాగులో రాసుకొచ్చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








